Current Affairs Telugu Daily

రూ.4.57లక్షలు పలికిన గాంధీ లేఖ
నూలు వడికే రాట్నం ప్రాముఖ్యాన్ని తెలుపుతూ మహాత్మాగాంధీ రాసిన ఉత్తరం అమెరికాలో నిర్వహించిన వేలంలో సుమారు రూ.4.57లక్షల ధర పలికింది.
  • గాంధీజీ గుజరాతీలో యశ్వంత్‌ప్రసాద్‌ అనే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాశారు. అమెరికాకు చెందిన ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ ఈ వేలం పాట నిర్వహించింది.
  • ఈ ఉత్తరంపై తేదీ లేదు. ఈ ఉత్తరాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచారు.
  • స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమ ప్రాధాన్యం, ఖాదీని భారతీయులంతా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని బాపూజీ లేఖలో పేర్కొన్నారు. నూలు వడికే రాట్నం దేశ ఆర్థిక స్వాతంత్య్రానికి ఓ చిహ్నం. ప్రతి ఇంటా నూలు వడకాలని ఆకాంక్షించారు.

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams