Current Affairs Telugu Daily

సెయిల్‌ ఛైర్మన్‌గా అనిల్‌ కుమార్‌
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) నూతన ఛైర్మన్‌గా అనిల్‌ కుమార్‌ చౌధురిని నియమిస్తూ ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌ 21న ఉత్తర్వులు జారీ చేసింది.
  • ప్రస్తుతం ఆయన సెయిల్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా కొనసాగుతున్నారు. 2018 జూన్‌ 30న పీకే సింగ్‌ పదవీ విరమణతో అప్పట్నుంచి సెయిల్‌ ఛైర్మన్‌ స్థానం ఖాళీగా ఉంది.
  • కొత్త ఛైర్మన్‌గా నియమితులైన అనిల్‌ కుమార్‌ 2020 డిసెంబరు రకు ఆ పదవిలో కొనసాగుతారు.
  • రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్‌ (ఆర్‌ఐటీఈఎస్‌)లో డైరెక్టర్‌ (ప్రాజెక్టు)గా వి.గోపీ సురేశ్‌ కుమార్‌ను నియమించింది.ఈ నియామకాన్నీ ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని కేబినేట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) నిర్ణయించింది.
SAIL ప్రధాన కార్యాలయం - న్యూడిల్లీ
SAIL ఏర్పాటు - 1954 జనవరి 19
SAIL-Steel Authority of India

views: 637

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams