Current Affairs Telugu Daily

జమ్మూకశ్మీర్‌లో ఇళ్ల నుంచి ముగ్గురు పోలీసుల అపహరణ, హత్య 
దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు 2018 సెప్టెంబర్‌ 21న ముగ్గురు పోలీసులను వారి ఇళ్ల నుంచి అపహరించుకెళ్లి, అతి దారుణంగా కాల్చి చంపారు.
  • హిజ్బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే తొయిబా ముష్కర ముఠాలు ఈ దాష్టీకానికి పాల్పడ్డాయి.
  • పోలీసులను ఇళ్ల నుంచి అపహరించుకెళ్లి చంపడం జమ్మూకశ్మీర్‌లో ఇదే మొదటిసారి. గతంలో రోడ్డు మీద కానీ, విధి నిర్వహణలో ఉన్నప్పుడు కానీ వారిని లక్ష్యంగా చేసుకునేవారు.
  • ఉగ్రవాదుల దారుణానికి బలైన పోలీసులను కానిస్టేబుల్‌ నిసార్‌ అహ్మద్‌, ఎస్‌పీవోలు ఫిర్దౌస్‌ అహ్మద్‌, క్వుంత్‌ సింగ్‌గా గుర్తించారు.
  • వీరి మృతదేహాలు ఒక నది వెంబడి ఉన్న పండ్ల తోటలో కనిపించాయి. ఈ ముగ్గుర్నీ బాటాగండ్‌, కాప్రాన్‌ గ్రామాల్లోని వారి ఇళ్ల నుంచి ఉగ్రవాదులు అపహరించుకెళ్లారు. 

views: 626

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams