Current Affairs Telugu Daily

అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని రజాక్‌ అరెస్టు 
భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌ అరెస్టయ్యారు.
  • 2018 సెప్టెంబర్‌ 19న కౌలాంపుర్‌లోని నజీబ్‌ కార్యాలయంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ వెల్లడించింది.
  • ప్రభుత్వ పెట్టుబడి నిధి నుంచి దాదాపు రూ.4,524 కోట్లు లూటీ చేసినట్లుగా నజీబ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2009లో నజీబ్‌ ప్రధాని పదవిలో ఉండగా ఏర్పాటైన 1ఎమ్‌డీబీ ప్రభుత్వ నిధి నుంచి నిధుల అక్రమ మళ్లింపునకు సంబంధించి ఆయనపై ఇదివరకే అభియోగాలు నమోదయ్యాయి.
  • దీనికి సంబంధించిన అక్రమ లావాదేవీలపై అమెరికాతోపాటు మరికొన్ని దేశాల్లో విచారణలు సాగుతున్నాయి. నజీబ్‌ అధికారంలో ఉండగా విమర్శకులు, మీడియా గొంతు నొక్కి విచారణను మూసేయించారు.
  • 2018 మేలో ప్రభుత్వం మారడంతో ఆయనపై విచారణలు మళ్లీ మొదయ్యాయి. నజీబ్‌కు చెందిన రూ.1,946 కోట్ల విలువైన సొత్తును కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

views: 724

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams