Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ జైలుశిక్ష నిలుపుదల
అవినీతి కేసులో జైలుపాలైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విముక్తి లభించింది. నవాజ్‌, ఆయన కుమార్తె మరియం, అల్లుడు కెప్టెన్‌ (రిటైర్డ్‌) మహమ్మద్‌ సఫ్దార్‌కు పడిన జైలుశిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సీ) నిలుపుదల చేసింది.
  • రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
  • అవెన్‌ఫీల్డ్‌ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో నవాజ్‌కు 10 ఏళ్లు, మరియంకు 7 ఏళ్లు, సఫ్దార్‌కు ఒక ఏడాదిపాటు కారాగార శిక్షను విధిస్తూ పాక్‌లోని ‘జవాబుదారీ కోర్టు’ 2018 జులైలో తీర్పునిచ్చింది.
  • ఈ కేసు కారణంగానే నవాజ్‌ ప్రధాని పదవిని కూడా కోల్పోయారు. ఈ శిక్షను సవాలు చేస్తూ నవాజ్‌ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను ఐహెచ్‌సీ ద్విసభ్య ధర్మాసనం 2018 సెప్టెంబర్‌ 19న విచారించింది.

views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams