Current Affairs Telugu Daily

రూ.68,789 కోట్లకు సూక్ష్మరుణ పరిశ్రమ 
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత సూక్ష్మ రుణ పరిశ్రమ 47 శాతం వృద్ధి సాధించింది. 2018 మార్చి నాటికి సూక్ష్మ రుణ కంపెనీ స్థూ రుణ పోర్ట్‌ఫోలియో రూ.68,789 కోట్లకు చేరింది.
  • అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది రూ.46,842 కోట్లుగా ఉందని ఒక నివేదిక తెలిపింది.
  • భారత్‌ మైక్రోఫైనాన్స్‌ నివేదికను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విడుదల చేశారు. నివేదిక ప్రకారం 2017-18లో రుణ పంపిణీ 56 శాతం పెరిగి రూ.81,737 కోట్లకు చేరింది.
  • 2015-16 తర్వాత ఇదే అత్యధికం. అగ్రగామి 10 సూక్ష్మరుణ సంస్థలు రూ.55,013 కోట్లు పంపిణీ చేయగా మొత్తం పరిశ్రమలో ఇవి 67 శాతానికి సమానం. ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాదిలో 34 శాతం, ఉత్తరాదిలో 30 శాతం, మధ్య భారత్‌లో 18 శాతం, పశ్చిమ భారత్‌లో 9 శాతం చొప్పున సంస్థలు రుణాలిచ్చాయి.

views: 672

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams