Current Affairs Telugu Daily

‘స్వయంప్రభ’ యాప్‌తో ఫోనులో జేఈఈ, నీట్‌ పాఠాలు 
జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ను దృష్టిలో పెట్టుకొని ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన పాఠాలను ఫోనులో వీక్షించేలా కేంద్ర మానవ వనరులశాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • ప్రవేశ పరీక్షకు విద్యార్థుల శిక్షణ కేంద్రాలపై ఆధారపడకుండా ఆర్థికంగా వెనకబడినవారికీ నాణ్యమైన పాఠాలను బోధించాన్న లక్ష్యంతో ఐఐటీ ప్రొఫెసర్లు గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రా పాఠాలను రూపొందించారు.
  • ఐఐటీ డిల్లీ నేతృత్వంలో 600 పాఠాలను తయారు చేశారు. ‘స్వయం ప్రభ’ పేరిట కేంద్ర మానవ వనరుల శాఖ మొత్తం 32 డైరెక్ట్‌ టూ హోం(డీటీహెచ్‌) ఛానెళ్లను ఉచితంగా వినియోగించుకునేలా అందుబాటులోకి తెచ్చింది.
  • వాటిలో 19వ ఛానెల్‌ నుంచి 21వ ఛానెల్‌ వరకు జేఈఈ, నీట్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కేటాయించారు. ఒక్కో ఛానెల్‌లో ఒక్కో సబ్జెక్టు పాఠాలు ప్రసారమవుతాయి.
  • వాటిని వీక్షించాలంటే ఇంటర్నెట్‌ లేదా సెట్‌ టాప్‌ బాక్స్‌ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల ఎక్కువ మంది విద్యార్థులకు తెలిసే అవకాశం లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అధికంగా ఉండటంతో ‘స్వయంప్రభ’ పేరిట యాప్‌ను తయారు చేశారు.
  • ఈ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కేంద్రం 2017 జులైలోనే స్వయంప్రభ పేరిట కొన్ని ఛానెళ్లను  ప్రారంభించింది.
  • ఎక్కువ మంది విద్యార్థులను చేరుకోవాన్న లక్ష్యంతో ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు కేంద్రం నెలకొల్పిన జాతీయ పరీక్ష సంస్థ(ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌లో కూడా ఈ పాఠ్యాంశాలను పొందుపరిచారు.

views: 690

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams