Current Affairs Telugu Daily

పోలవరంలో కాంట్రాక్టర్‌కు అనుచిత రాయితీలు రూ.1853 కోట్లు : కాగ్‌
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన కాంట్రాక్టర్‌కు ఒప్పంద నిబంధనలను సడలిస్తూ రూ.1,853.08 కోట్ల మేర అనుచిత రాయితీలు కల్పించారని కంప్ట్రోర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆక్షేపించింది.
  • పలు రాయితీలు ఇచ్చినా ఈ ప్రాజెక్టు పనుల నిర్ణీత గడువు లోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది. కాగ్‌ 2012 ఏప్రిల్‌ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పురోగతిపై సమీక్షించింది.
  • 2018 బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే ఈ నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ 2018 సెప్టెంబర్‌ 19న అసెంబ్లీలో సమర్పించారు. ఈ నివేదిక పోలవరానికి సంబంధించి అనేక విషయాల్లో ప్రభుత్వ, జలవనరులశాఖ తీరును ఎండగట్టింది.
  • ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయడం నుంచి సవరించిన అంచనాలు, కేంద్రానికి బిల్లులు సమర్పించడంలో ఆలస్యం వల్ల నిధులు సకాలంలో రాబట్టుకోలేకపోయారని తప్పుపట్టింది.
  • పోలవరం ప్రాజెక్టు ఫలితాలు పొందాలంటే తక్షణమే గ్రామాల వారీగా డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. అసమగ్ర ప్రణాళిక, ఆకృతులు ఖరారు, భూసేకరణ, పునరావాసం పునర్నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం వల్ల 2004లో ప్రారంభమైన పోలవరం పనులు మందగతిలో ఉన్నాయని పేర్కొంది.
  • 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆశించిన ప్రయోజనాలు పొందడం కష్టమేనని పేర్కొంది. ఒప్పందపు నిబంధనలు పాటింపజేయడంలో రాష్ట్ర జలవనరులశాఖ వైఫల్యం కూడా ఇందుకు ఒక కారణమేనని అభిప్రాయపడింది.
  • పోలవరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలసంఘం ఆమోదించినా అదీ లోపాలతోనే ఉందని, ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఇందులో ఉపయోగించుకోలేదని ఆక్షేపించింది. ఈ విషయాన్ని జలవనరులశాఖ అంగీకరించిందని తెలిపింది.
  • ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అటవీ పర్యావరణ నిబంధనలు ఏవీ సరిగా అమలు కావడం లేదంది. ఎడమ, కుడి కాలువల్లో 15 ప్యాకేజీలకు సంబంధించి ఒప్పంద గడువు లోపు భూసేకరణ పూర్తి చేసి గుత్తేదారులకు అప్పజెప్పలేకపోయారని పేర్కొంది.
  • కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదని ఎత్తిచూపింది.

views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams