Current Affairs Telugu Daily

తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌
తెలంగాణలో ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఏఐసీసీ 10 పది కమిటీలను ఏర్పాటు చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిను నియమించారు.
  • ఆ పదవిలో ఉన్న భట్టి విక్రమార్కను కీలకమైన ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ప్రచార కమిటీ సహాదారుల, స్టార్‌ క్యాంపెయినర్‌గా మాజీ ఎంపీ విజయశాంతికి బాధ్యతలు అప్పగించారు.
  • తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరినవారిలో రేవంత్‌రెడ్డిని కీలక పదవి వరించగా.. వేం నరేందర్‌రెడ్డి, సీతక్కలకి కమిటీల్లో స్థానం దక్కింది.
  • మేనిఫెస్టో కమిటీలో పార్టీ నేతలతోపాటు ఉస్మానియా ఐకాస బాధ్యులను, ప్రొఫెసర్లను నియమించారు.  మొత్తంగా 10 కమిటీల్లో 223 మందితో జాబితా విడుదల చేశారు. 
పదిహేను మంది సభ్యులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 

views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams