Current Affairs Telugu Daily

జెన్‌కో, ట్రాన్స్‌కోల సీఎండీ ప్రభాకరరావుకు స్కోచ్‌ పురస్కారం 
తెలంగాణ రాష్ట్ర జెన్‌కో, ట్రాన్స్‌కోల సీఎండీ దేవుపల్లి ప్రభాకరరావు స్కోచ్‌ సంస్థ ఉత్తమ నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.
  • డిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్బులో 2018 సెప్టెంబర్‌ 19న జరిగిన కార్యక్రమంలో ఆయన తరఫున ట్రాన్స్‌కో సంచాలకుడు జగత్‌రెడ్డి, ఎస్‌ఈ హనుమాన్‌, శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని స్కోచ్‌ సంస్థ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ నుంచి అందుకున్నారు.
  • దేవులపల్లి సమర్థ పనితీరు వల్లనే రాష్ట్ర విద్యుత్‌ రంగం ప్రగతి పథంలో పయనిస్తోందని ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
  • నిరంతర విద్యుత్‌ సరఫరాలో మెరుగైన పనితీరుకుగాను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలకు స్కోచ్‌ పురస్కారం లభించింది. పురస్కారాన్ని ఈసంస్థ తరపున జీఎం నగేశ్‌, డీఈ అనిల్‌కుమార్‌లు అందుకున్నారు.

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams