Current Affairs Telugu Daily

అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు 
ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2018 సెప్టెంబర్‌ 19న న్యూడిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ సంఘం సమావేశం నిర్వహించారు
  • అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనాలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఇంతవరకు నెలకు రూ.3000 పొందుతున్నవారికి ఇప్పుడు రూ.4500, మినీ అంగన్‌వాడీల్లో రూ.2200 పొందుతున్నవారికి రూ.3500 లభిస్తుంది.
  • అంగన్‌వాడీ సహాయకులకు ఇచ్చే మొత్తాన్ని రూ.1500 నుంచి రూ.2250కి, ఆశా కార్యకర్తలకు ఇస్తున్న రూ.వెయ్యిని రూ.2000కి పెంచారు. వీరికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకా కింద రూ.250 నుంచి రూ.500 చెల్లిస్తారు.
  • మార్పు 2018 సెప్టెంబర్‌ నుంచే అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 12.83 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, 10.50 లక్షల మంది సహాయకులు, 10.23 లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు.

views: 635

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams