Current Affairs Telugu Daily

హిమదాస్‌కు అడిడాస్‌ స్పాన్సర్‌షిప్‌ 
భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్‌ స్పాన్సర్‌షిప్‌ చేస్తుంది.
  • ఈ మేరకు  2018 సెప్టెంబర్‌ 18న న్యూడిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అస్సాం స్ప్రింటర్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది.
  • ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్‌ కిట్‌ స్పాన్సర్‌ చేస్తుంది. ఫిన్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్‌-20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా హిమదాస్‌ చరిత్ర సృష్టించింది.
  • ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది. అడిడాస్‌ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది.
  • ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమదాస్‌’ అని, ఇంకోదానిపై ‘క్రియేట్‌ హిస్టరీ’ అని ముద్రించింది. 

views: 849

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams