Current Affairs Telugu Daily

భారత్‌-బంగ్లా ‘మైత్రి పైప్‌లైన్‌’ నిర్మాణ పనులు ప్రారంభం
భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య ‘మైత్రి పైప్‌లైన్‌’ ప్రాజెక్టు నిర్మాణ పనులు  2018 సెప్టెంబర్‌ 18న ప్రారంభమయ్యాయి.
  • భారత ప్రధాని నరేంద్రమోడి, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రారంభించారు.
  • దీనితోపాటుగా రెండు రైల్వే ప్రాజెక్టుల పనులను కూడా మొదలుపెట్టారు. 130 కి.మీ. పొడవైన ‘మైత్రి పైప్‌లైన్‌’ ద్వారా బంగ్లాదేశ్‌కు భారత్‌ శుద్ధి చేసిన ఇంధనం సరఫరా చేయనుంది.
  • పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడి నుంచి బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పుర్‌ జిల్లాలో ప్రబతీపుర్‌ వరకూ దీన్ని వేయనున్నారు.
  • రూ.346 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు.. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. ఏటా పది లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఇంధనం తరలించే పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని.
  • భారత్‌, బంగ్లాదేశ్‌ 2018 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి మూడేళ్లు భారత్‌ 2.5లక్షల టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. 

views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams