Current Affairs Telugu Daily

1,377 కోట్లకు టైమ్‌ మేగజీన్‌ అమ్మకం
అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దిగ్గజం సేల్స్‌ ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ మార్క్‌ బెనియాఫ్‌కు టైమ్‌ మేగజీన్‌ను రూ.1,377 కోట్లకు (190 మిలియన్‌ డాలర్లు) అమ్ముతున్నట్లు మెరిడిత్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది.
  • ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. టైమ్‌ మేగజీన్‌ రోజువారీ వార్తకు సేకరణ, ప్రచురణకు సంబంధించి నూతన యాజమాన్యం జోక్యం చేసుకోబోదని పేర్కొంది.
  • ఈ కొనుగోలు పూర్తిగా బెనియాఫ్‌ వ్యక్తిగతమనీ, దీనికి సేల్స్‌ఫోర్స్‌ కంపెనీతో సంబంధం లేదంది.
  • 2017లో టైమ్‌ మేగజీన్‌ సహా పలు ప్రచురణలను టైమ్‌ కంపెనీ నుంచి మెరిడిత్‌ కొనుగోలు చేసింది. 1923, మార్చిలో యేల్‌ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థుల హెన్రీ లూస్‌, బ్రిటాన్‌ హడెన్‌లు కసి టైమ్‌ మేగజీన్‌ను ప్రారంభించారు.
  • అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇదే తరహాలో 2013లో వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికను రూ.1,811 కోట్లకు కొన్నారు.

views: 825

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams