Current Affairs Telugu Daily

అంతార్జతీయ యోగా దినోత్సవం 
2017 జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 3వ అంతార్జతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో యోగా గురు రాందేవ్‌ బాబా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొన్న కార్యక్రమంలో 54వేల మందికి పైగా పాల్గొనటం గిన్నిస్‌ రికార్డుకెక్కింది. న్యూయార్క్‌ లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి యోగాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. ఆరెస్సెస్‌ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ (MRM)కి చెందిన 5వేల మంది కార్యకర్తలు యూపీలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
MRM-Muslim Rashtriya Manch 
ప్రతి ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాని ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్‌లో తీర్మానించింది. 
యోగా ఉత్సవంలో పాల్గొన్న ప్రజలు తమ అనుభవాలను పంచుకొనేందుకు ప్రభుత్వం ఒక మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. సెలబ్రేటింగ్‌ యోగా పేరిట ఉన్న ఈ యాప్‌ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆవిష్కరించారు. 
పుణె సంస్థకు యోగా అవార్డు
యోగా అభివృద్ధికి, ప్రోత్సాహానికి కృషి చేసిన వారికి అందించే ప్రధానమంత్రి అవార్డు పుణెలోని రమామణి అయ్యంగార్‌ స్మారక యోగా సంస్థకు లభించింది. 
ఐరాసపై యోగ ముద్ర
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి యోగా ముద్రతో తననుతాను అలంకరించుకున్నది. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌, ఐక్యరాజ్యసమితిలో భారతీయ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఐక్యరాజ్యసమితి స భవనంపై యోగా ముద్రను బటన్‌ నొక్కి ఆవిష్కరించారు.
2017 (3వ) అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్‌ - Yoga for Health
2016 (2వ) అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్‌ - Connect the Youth
నేపథ్యం 
- ప్రతి సంవత్సరం జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్రమోడీ  2014 - 2014 డిసెంబర్‌లో భారత రాయబారి అశోక్‌ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టారు
- భారత్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2014 డిసెంబర్‌ 11న ఆమోదం - 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితిలో రికార్డు స్థాయిలో 177 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి
- ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద స్థాయిలో మద్దతు లభించడం ఇదే ప్రథమం
- అదేవిధంగా ఐక్యరాజ్యసమితిలో కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం
- ప్రపంచ ఆరోగ్యం, విదేశాంగ విధానం అజెండాలో భాగంగా ప్రతి ఏడాది జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు
- జూన్‌ 21న సుదీర్ఘమైన పగటి రోజు ఉండడంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది
- ఈ క్రమంలోనే యోగా దినోత్సవాన్ని జూన్‌ 21న జరుపుకోవాని నిర్ణయించారు

views: 859

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams