Current Affairs Telugu Daily

శారిడాన్‌ సహా 4 మందులపై నిషేధం ఎత్తివేత
నొప్పి నివారణకు వాడే ‘శారిడాన్‌’ సహా- నిషేధానికి గురైన 4 రకాల ‘నిర్దిష్ట మోతాదు సమ్మిళిత’ (ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌-ఎఫ్‌డీసీ) మందు బిళ్లల అమ్మకాలను దేశవ్యాప్తంగా కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
  • ఔషధ తయారీ సంస్థలు, ఫార్మా సంఘాలు దాఖలు చేసిన అభ్యర్థనను జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా ధర్మాసనం 2018 సెప్టెంబర్‌ 17న విచారించింది.
  • దీనిపై స్పందన తెలపాల్సిందిగా కేంద్ర సర్కారుకు నోటీసు జారీ  చేసింది. శారిడాన్‌ (పిరమల్‌ హెల్త్‌కేర్‌), పిరిటాన్‌ (గ్లాక్సోస్మిత్‌క్లైన్‌), డార్ట్‌ (జుగ్గత్‌ ఫార్మా)తో పాటు మరో మందుబిళ్ల విక్రయాలకు ధర్మాసనం అంగీకరించింది.
  • 2018 సెప్టెంబర్‌ 7న విడుదల చేసిన ప్రకటన ద్వారా ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధించిన 328 ఎఫ్‌డీసీ మందు జాబితాలోని ఇతర మందులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వలేదు.
  • రెండు, అంతకంటే ఎక్కువ మందుల్ని ఒక స్థిర నిష్పత్తిలో కలిపి ఒకే మోతాదు మందుగా రూపొందిస్తే వాటిని ఎఫ్‌డీసీ ఔషధాలుగా పిలుస్తారు.
  • అసైక్లోఫెనాక్‌, పారాసిటమాల్‌, రాబిప్రజోల్‌ లవణాల మిశ్రమమైన ఏస్‌ ప్రాక్సివియాన్‌ మాత్రల్ని ఫార్మా దిగ్గజం- వోక్‌హార్డ్‌ విక్రయించుకునేందుకు డిల్లీ హైకోర్టు ఇదివరకు అనుమతించింది.
  • 11 ఏళ్లుగా విక్రయిస్తున్న ఈ ఔషధాన్ని ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో తెలిపే ‘ఔషధాల సాంకేతిక సలహా మండలి’ (డీటీఏబీ) నివేదికను తమకు అందించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ కంపెనీ సవాల్‌ చేసింది.

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams