Current Affairs Telugu Daily

నాసా ‘ఐస్‌శాట్‌-2’ ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా కరిగిపోతున్న మంచుపై అధ్యయనం చేయడానికి నాసా అత్యాధునిక స్పేస్‌ లేజర్‌ ఆధారిత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.
  • ఐస్‌శాట్‌-2గా పిలుస్తున్న ఈ ఉపగ్రహాన్ని డెల్టా-2 రాకెట్‌ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ 15న విజయవతంగా నింగిలోకి మోసుకెళ్లింది.
  • ఈ ప్రయోగానికి సుమారు రూ. 7 వేల కోట్లు వ్యయం చేసినట్లు నాసా వెల్లడించింది. భూతాపం, సముద్ర నీటి మట్టాల పెరుగుదలపై కచ్చితమైన అంచనాలు పొందేందుకు ఈ ఉపగ్రహం దోహదపడుతుందని భావిస్తున్నారు.
  • 2003లో ప్రయోగించిన ఐస్‌శాట్‌ ఉపగ్రహం 2009 వరకు సేవందించింది. గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికా తీర ప్రాంతాల్లో మంచు పలకలు పలచనవుతున్న సంగతిని అది వెలుగులోకి తెచ్చింది.
  • ఐస్‌శాట్‌-2లో లేజర్‌ సాంకేతికతను వాడుతున్నారు కాబట్టి  గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాల్లోని అత్యంత సూక్ష్మ మందమైన మంచు పలకల్లో వస్తున్న మార్పును అంచనావేయడానికి సరిపడ సమాచారాన్ని సమకూరుస్తుంది.

views: 848



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams