Current Affairs Telugu Daily

GST అధికారిక వెబ్‌ సైట్‌ ప్రారంభం 
దేశమంతా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(GST)ని ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన సమాచారాన్ని, GST పన్ను విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు 2017 జూన్‌ 21న అధికారిక GST కౌన్సిల్‌ వెబ్‌ సైట్‌ను అధికారులు ప్రారంభించారు. http://www.gstcouncil.gov.in   వెబ్‌సైట్‌ ద్వారా GST సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఇందులో GST ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని సమావేశాలు జరిగాయి, ఎన్ని రకాల పన్ను విధానాలు ఉన్నాయి తదితర సమాచారాన్ని అంతా పొందు పరిచారు. GST ప్రచారం కల్పించేందుకు ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నియమించారు.
GST- Goods and Services Tax 
జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం మినహా  GSTకి ఆమోదం
దేశవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్‌ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర జీఎస్టీ(SGST) చట్టాలను ఆమోదించాయి. కేరళ, పశ్చిమ బెంగాల్‌ మాత్రం SGSTను ఆమోదిస్తూ ఆర్డినెన్స్‌ను జారీచేశాయి.
SGST-State Goods and Service Tax


views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams