Current Affairs Telugu Daily

డౌన్‌లోడ్‌ వేగంలో జియోకు అగ్రస్థానం : ట్రాయ్‌ 
4జీ డేటా డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియోకే అగ్రస్థానంలో నిలిచింది. 2018 ఆగస్టులో జియో జాతీయ సగటు వేగం 22.3 ఎంబీపీఎస్‌ (సెకనుకు మెగాబైట్స్‌)గా నమోదైందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది.
  • అప్‌లోడ్‌ వేగానికి వస్తే, 5.9 ఎంబీపీఎస్‌తో ఐడియా స్యొలార్‌ తొలి స్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్‌కు వస్తే భారతీ ఎయిర్‌టెల్‌ 10 ఎంబీపీఎస్‌, ఐడియా 6.2 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ 6.7 ఎంబీపీఎస్‌ సాధించాయి.
  • అప్‌లోడ్‌ వేగంలో వొడాఫోన్‌ 5.1 ఎంబీపీఎస్‌, రియన్స్‌ జియో 4.9 ఎంబీపీఎస్‌, ఎయిర్‌టెల్‌ 4.4 ఎంబీపీఎస్‌గా నిలిచాయి.
  • ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌, వీడియో వీక్షణం, మెయిల్‌ వంటివి చూసుకునేందుకు డౌన్‌లోడ్‌ వేగం ముఖ్యం. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ వంటివి ఎవరికైనా పంపేందుకు అప్‌లోడ్‌ వేగం ప్రధానమవుతుంది.
ట్రాయ్‌ ఛైర్మన్‌ - రామ్‌సేవక్‌ శర్మ

views: 728Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams