Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో భారత్‌కు 130వ స్థానం
ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక(HDI)లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. 189 దేశాలతో ఈ సూచికను రూపొందించారు. బంగ్లాదేశ్‌ 136వ, పాకిస్థాన్‌ 150వ స్థానాల్లో నిలిచాయి.
  • 189 దేశాల్లో 50 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్‌లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్‌లో ఉన్నాయి. ఆసియా సగటు ‘హెచ్‌డీఐ’తో పోలిస్తే భారత్‌ 0.638 విలువతో మానవాభివృద్ధి గ్రూప్‌లో మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరిలో చోటు దక్కించుకుంది.
  • 2016లో 0.624 విలువతో 131వ స్థానానికి పరిమితమైంది. ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికలుగా ఏటా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(UNDP) ర్యాంకులు ప్రకటిస్తోంది.
ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక
స్థానం        దేశం
1    నార్వే
2    స్విట్జర్లాండ్‌
3    ఆస్ట్రేలియా
4    ఐర్లాండ్‌
5    జర్మనీ
130    ఇండియా
136    బంగ్లాదేశ్‌
150    పాకిస్థాన్‌
HDI-Human Development Index
UNDP-United Nations Development Programme
UNDP ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌, అమెరికా
UNDP అధిపతి : అచిమ్‌ స్టెయినర్‌
UNDP ఏర్పాటు : 1965

views: 1629

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams