Current Affairs Telugu Daily

ISSF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 3వ స్థానం  
అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ISSF) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కొత్త చరిత్ర లిఖించింది.
  • గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరిగిన పోటీ ముగింపు రోజైన 2018 సెప్టెంబర్‌ 14న రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్‌ ఖాతాలో చేరడంతో మొత్తంగా 27 పతకాల(11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో 3వ స్థానంతో ముగించింది.
  • 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌ రెండు ఒలింపిక్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అంజుమ్‌ మౌద్గిల్‌, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు.  
ISSF-International Shooting Sport Federation
ISSF ప్రధాన కార్యాలయం : మ్యూనిచ్‌, జర్మనీ

views: 810

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams