Current Affairs Telugu Daily

కుటుంబ కంపెనీలు అత్యధికంగా గల దేశాల్లో భారత్‌కు 3వ స్థానం 
కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, ఇతరుల నేతృత్వంలో నడిచే కంపెనీల కంటే మిన్నగా రాణిస్తున్నాయని  క్రెడిట్‌ సూయిజ్‌ పరిశోధనా సంస్థ  నివేదిక పేర్కొంది.
  • కుటుంబ కంపెనీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో 159 కంపెనీలతో చైనా మొదటి స్థానంలో, 121 సంస్థలతో అమెరికా 2వ స్థానంలో, 111 కంపెనీలతో భారత్‌ 3వ స్థానంలో నిలిచింది.
  • దేశీయంగా 111 కంపెనీలను కుటుంబాలు నిర్వహిస్తుండగా, వీటి మొత్తం మార్కెట్‌ విలువ 839 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.60 లక్షల కోట్లు) అని వెల్లడించింది. 
  • 434.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31.25 లక్షల కోట్ల) విలువైన 43 కంపెనీలతో కొరియా 4వ స్థానంలో నిలిచింది. తలా 26 కంపెనీలతో ఇండొనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌ 5వ స్థానంలో ఉన్నాయి. 
  • జపానేతర ఆసియా ప్రాంతంలో చూస్తే, చైనా, భారత్‌, హాంకాంగ్‌ ఈ విభాగంలో ఆధిపత్యం వహిస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రాంతంలోని మొత్తం కంపెనీల్లో 65 శాతం ఈ 3 దేశాల్లోనే ఉన్నాయని, విలువ పరంగా ఇది 71 శాతం (2.85 లక్షల కోట్ల డాలర్లు) అని తెలిపింది. 
  • జపానేతర ఆసియా ప్రాంతంలోని 11 దేశాల్లో ఉన్న కుటుంబల కంపెనీల విలువ, మొత్తం ప్రపంచంలో 53 శాతానికి సమానమని, వీటి మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.288 లక్షల కోట్లు).
  • 2017లో జపానేతర ఆసియా ప్రాంతంలోని కంపెనీలు, ఇతర కంపెనీల ప్రతిఫలం కంటే 25.63 శాతం అధికంగా అందించాయి. 2006 నుంచి చూస్తే, వార్షిక సగటు వాటా ప్రతిఫలం రూపేణ 4.2 శాతం అధికంగా రాణించాయి.
  • భారత్‌లో మరింత అధికంగా 13.9 శాతం సాధించాయి. ఇదే ఇతరుల ఆధ్వర్యంలోని సంస్థ ప్రతిఫలం 6 శాతంగా నమోదైంది. 
  • ప్రపంచంలో అత్యధికంగా లాభాలు ఆర్జిస్తున్న 50 కంపెనీల్లో 24 ఆసియాలోనే ఉన్నాయి. వీటి మార్కెట్‌ విలువ 748 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.53.85 లక్షల కోట్ల డాలర్లు). వీటిలో భారత్‌ నుంచి 192.2 బి.డాలర్ల (మార్కెట్‌ విలువ రూ.13.84 లక్షల కోట్లు) కలిగిన 12 సంస్థలున్నాయి. 
  • జపానేతర ఆసియా దేశాల్లో 30 అత్యుత్తమ ప్రదర్శన కనబరచే కంపెనీల్లో 50 శాతం భారత్‌ నుంచే ఉన్నాయి.
కుటుంబ కంపెనీలు అత్యధికంగా ఉన్న టాప్‌-5 దేశాలు
1    చైనా
2    అమెరికా
3    భారత్‌ 
4    కొరియా
5    ఇండొనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌ 

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams