Current Affairs Telugu Daily

328 ఔషధాలపై కేంద్రం నిషేధం 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 328 ఔషధాలపై నిషేధం విధించింది. ఈ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్స్‌ (ఎఫ్‌డీసీ) మందును అమ్మడం, తయారు చేయడం, పంపిణీ చేయడంపై ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
  • వీటిపై నిషేధం విధించడంతోపాటు మరో 6 రకాల మందులపై ఆంక్షలు విధించింది. క్షేమకరం కానటువంటి, అహేతుక మందులను నిషేధించేందుకు ఈ మంత్రిత్వ శాఖ 2016 నుంచి ప్రయత్నిస్తోంది.
  • వీటి తయారీదారుతో న్యాయపోరాటం చేస్తోంది. ఇప్పటికి ఈ మందులను నిషేధించడం సాధ్యమైంది. ఈ నిర్ణయం ప్రభావం దాదాపు 6 వేల బ్రాండ్లపై పడుతుంది.
  • అత్యంత ప్రజాదరణ పొందిన పెయిన్‌క్లిర్‌ శారిడాన్‌, చర్మ వ్యాధు మందు పాన్‌డెర్మ్‌, మధుమేహానికి వాడే గ్లూకోనార్మ్‌ పీజీ, యాంటీబయాటిక్‌ లుపిడిక్లాక్స్‌, యాంటీబ్యాక్టీరియల్‌ టాక్సిమ్‌ ఏజెడ్‌ వంటివాటిపై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది.
  •  2016 మార్చి 10న ప్రభుత్వం 344 ఎఫ్‌డీసీపై నిషేధం విధించింది. ఆ తర్వాత మరో ఐదింటిని ఈ జాబితాలకు జోడించింది. ఈ మందు తయారీదారులు వివిధ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 2017 డిసెంబరు 15న స్పందిస్తూ ఈ వివాదంపై పరిశీన జరపాలని డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ బోర్డ్‌ (డీటీఏబీ)ని ఆదేశించింది.
  • ఈ సంస్థ 328 మందు ప్రజలకు హాని కలిగించే అవకాశం ఉన్నట్లు నివేదిక సమర్పించింది.
  • ప్రభుత్వం అంతకుముందు 344 మందులతో రూపొందించిన జాబితాలోని 15 మందులపై నిషేధం విధించరాదని సుప్రీంకోర్టు తెలిపింది.
  • అవసరమైతే ఈ మందులపై తదుపరి దర్యాప్తుకు ఆదేశించవచ్చునని తెలిపింది. ఈ 15 మందులను 1988కి ముందు నుంచి భారతదేశంలో తయారు చేస్తున్నందువల్ల సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams