Current Affairs Telugu Daily

సౌదీ యువరాజుగా మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ 
సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ 2017 జూన్‌ 21న తన వారసుడిని ప్రకటించారు. తన 31 ఏళ్ల కుమారుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ను వారసుడిగా ప్రకటిస్తూ, అతడే తన తదుపరి సింహాసనాన్ని అధిష్టిస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు 2017 జూన్‌ 21న రాజ శాసనాన్ని విడుదల చేశారు. మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ దేశ రక్షణమంత్రిగా, ఆర్థికమండలి సారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భవిష్యత్‌ లో సౌదీ సింహాసననాన్ని అధిష్టిస్తారనుకున్న మహమ్మద్‌ బిన్‌ నయీఫ్‌ ను ఆ హోదా నుంచి తప్పించారు. ‘క్రౌన్‌ ప్రిన్స్‌’ అనే టైటిల్‌ ను, దేశ ఆంతరంగిక భద్రతా మంత్రి పదవి నుంచి నయీఫ్‌ ను తొలగించారు.
views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams