Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియమితులయ్యారు.
  • ఆయన నియామక ఫైల్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 సెప్టెంబర్‌ 13న సంతకం చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా 2018 అక్టోబర్‌ 2న పదవీవిరమణ చేయనుండగా.. అక్టోబర్‌ 3న రంజన్‌ గొగోయ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.  
  • దీపక్‌మిశ్రా పదవీకాలం ముగియనుండటంతో తదుపరి వారసుడి పేరు సిఫార్సు చేయాల్సిందిగా ఆయనకు న్యాయ మంత్రిత్వశాఖ లేఖ రాసింది.
  • సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్‌ గొగొయ్‌ పేరును సీజేఐ సిఫారసు చేశారు.
  • సదరు సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి నిర్ణయం కోసం పంపింది. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో నియామక ప్రక్రియ పూర్తయింది. 2019 నవంబరు 17 వరకు జస్టిస్‌ గొగోయ్‌ ఈ పదవిలో కొనసాగుతారు.
  • జస్టిస్‌ గొగొయ్‌ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌ అసోసియేషన్‌లో చేరారు. 2001 ఫిబ్రవరి 28న గౌహతిగువాహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.
  • 2010 సెప్టెంబరులో పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012 ఏప్రిల్‌లో పదోన్నతి పొందారు.
  • కేసు కేటాయింపులో సీజేఐ జస్టిస్‌ మిశ్రా వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ 2018 జనవరిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నలుగురు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగొయ్‌ కూడా ఒకరు.

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams