Current Affairs Telugu Daily

పోలవరం స్పిల్‌ వే గ్యాలరీలో సీఎం చంద్రబాబు నడక
పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 2018 సెప్టెంబర్‌ 12న కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్యాలరీ నడకను చేపట్టారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ వెంట రాగా ముహూర్త సమయం సరిగ్గా ఉదయం 11.20 గంటలకు పోలవరం స్పిల్‌ వే గ్యాలరీలోకి చంద్రబాబు అడుగుపెట్టారు. గ్యాలరీలో కిలోమీటరు మేర భువనేశ్వరి, బ్రాహ్మణి సైతం నడిచారు. ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్‌ 600 మీటర్లు నడిచారు. ఉదయం 11.20కి లోపలికి ప్రవేశించగా దాదాపు 25 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి నడక పూర్తయింది. 48వ బ్లాకువద్ద ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించి లోపలికి ప్రవేశించారు. ఒకటో బ్లాకు నుంచి బయటకు వచ్చారు. 
views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams