Current Affairs Telugu Daily

మాసాన్‌పల్లిలో డిజిటల్‌ సేవలు ప్రారంభం 
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాసాన్‌పల్లిలో డిజిటల్‌ సేవలను పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ 2018 సెప్టెంబర్‌ 11న సచివాలయం నుంచి ప్రారంభించారు.
  • టీఫైబర్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని 4 గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా గుర్తించి, సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
  • టీడీఎన్‌, హెచ్‌పీఈ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొదటి డిజిటల్‌ గ్రామంగా మాసాన్‌పల్లిని గుర్తించారు.
  • ఇక్కడ ఏర్పాట్లు సిద్ధం కావడంతో సచివాలయం నుంచే సేవను ప్రారంభించారు. డిజిటల్‌ గ్రామంలో ఇ-విద్య, వైద్యం, పంచాయతీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అన్ని రకా ధ్రువీకరణ పత్రాలను డిజిటల్‌ విధానంలో సత్వరమే పొందవచ్చు.

views: 845

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams