Current Affairs Telugu Daily

మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్‌ మిథాలీరాజ్‌ 
మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్‌గా భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. శ్రీలంక, భారత్‌ మధ్య మహిళ వన్డే సిరీస్‌లో భాగంగా 2018 సెప్టెంబర్‌ 11న జరిగిన తొలి వన్డే కెప్టెన్‌గా మిథాలీకి 118వ వన్డే.
  • దీంతో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ చార్లోట్‌ ఎడ్వర్డ్‌ పేరిట ఉన్న రికార్డు (117)ను ఆమె బద్దులు కొట్టింది. ఆస్ట్రేలియా అమ్మాయి బెలిందా క్లార్క్‌ (101) మూడో స్థానంలో ఉంది.
  • మిథాలీ తొలిసారి 2003-2004లో భారత జట్టుకు నాయకత్వం (వెస్టిండీస్‌పై) వహించింది. ఆమె నేతృత్వంలో భారత జట్టు 2005, 2017లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చేరింది.
  • మూడు ఆసియాకప్‌ టైటిళ్లు (2005, 2006, 2008) గెలిచింది. మిథాలీరాజ్‌ 32 టీ20 మ్యాచ్‌ల్లో కూడా భారత జట్టుకు నాయకత్వం వహించింది.

views: 733

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams