Current Affairs Telugu Daily

కొండగట్టు ఘాట్‌లో బస్సు బోల్తాపడి 58 మంది దుర్మరణం 
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల సుప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవస్థానమైన కొండగట్టు ఆలయ సమీపంలోని ఘాట్‌రోడ్డులో 2018 సెప్టెంబర్‌ 11న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 58 మంది దర్మరణం పాలయ్యారు.
  • అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది జగిత్యా జిల్లాలోని కొడిమ్యాల మండలం శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, తిర్మలాపూర్‌కు చెందినవారే ఉన్నారు.
  • కొండగట్టు ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించారు.
  • మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, మృతుల్లో రైతుంటే రైతు బీమానూ వర్తింపజేస్తామని మంత్రులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్‌ వెల్లడించారు. 
  • తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టులో వెలసిన ఆంజనేయస్వామి ఆలయానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది.
  • అంజన్నను దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏటా రెండు సార్లు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు (చిన్న, పెద్ద) జరుగుతాయి.
  • ఈ ఉత్సవాల సందర్భంగా హనుమాన్‌ దీక్షాపరులు భారీగా వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించి దీక్షా విరమణ చేస్తుంటారు.
  • పంచముఖ ఆంజనేయస్వామిలోని ఒక ముఖమైన నారసింహ రూపం ఇక్కడి హనుమంతుడి విగ్రహం తల పైభాగంలో ఉంటుంది. కొండగట్టు జగిత్యాలకు 20 కి.మీ, కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో ఉంటుంది. 
తెలంగాణ రవాణా శాఖ మంత్రి - పట్నం మహేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌ - సోమారపు సత్యనారాయణ

views: 789

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams