Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ కు 12 ‘ఉపాధి’ అవార్డులు
ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఫలితాలు సాధించింది. మొత్తం 10 విభాగాల్లో 12 అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది. 2018 సెప్టెంబర్ 11న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఈ అవార్డులను స్వీకరించారు.
  • పారదర్శకత, జవాబుదారీతనంలో మొదటిస్థానం, 23 శాఖలతో అనుసంధానంలో, బీఎ్‌ఫటీ అమలులో రెండో స్థానం, అత్యధిక పనులు పూర్తి చేసినందుకు మూడోస్థానంలో నిలవగా... రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డైరెక్టర్‌ రంజిత్‌ భాషా, మాజీ కమిషనర్‌, ప్రస్తుత ఆర్‌డబ్ల్యూఎస్‌ సెక్రటరీ బి.రామాంజనేయులు ఈ అవార్డులను తీసుకున్నారు.

views: 782

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams