Current Affairs Telugu Daily

గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్‌
పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ మరో ఘనత సాధించింది.
  • గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్‌ ఐఎల్‌78 అనే ట్యాంకర్‌ విమానం నుంచి 1,900 కేజీ ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది.
  • భూమికి 20,000 అడుగు ఎత్తులో తేజస్‌(ఎస్‌ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్‌ తయారీ ఐఎల్‌-78 ఎంకేఐ ఆయిల్‌ ట్యాంకర్‌ విమానం నుంచి 1,900 కేజీ ఇంధనాన్ని నింపుకుంది.
  • గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్‌ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్‌ విమానంతో డాకింగ్‌(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్‌ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది.
  • దీంతో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్‌ జెట్‌కు ఫైనల్‌ ఆపరేషనల్‌ క్లియరెన్స్‌(ఎఫ్‌ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్‌ మార్క్‌-1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) 2017 డిసెంబర్‌లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్‌ ఇచ్చింది. 

views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams