Current Affairs Telugu Daily

బజాజ్‌ అలయంజ్‌ వినూత్న ఆరోగ్య బీమా పథకం 
బజాజ్‌ అయంజ్‌ లైఫ్‌ హెల్త్‌ కేర్‌ గోల్‌ అనే పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని బజాజ్‌ అలయంజ్‌ బీమా కంపెనీ తీసుకొచ్చింది. దీంతో ఈ సంస్థ ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టినట్లు అయింది.
  • ఒకే ప్రీమియంతో ఆరుగురు సభ్యుల కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయాలన్ని కల్పించటం ఈ పాలసీ ప్రత్యేకత. దీని కింద 36 రకాల వ్యాధులకు బీమా సదుపాయం లభిస్తుంది.
  • వినికిడి లోపానికి చికిత్స, గుండె జబ్బుకు స్టెంటు వేయటం, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాసిస్‌ చేయటం.... తదితర వ్యాధులు ఇందులో ఉన్నాయి.
  • ఒక కుటుంబ సభ్యుడికి చికిత్స కోసం కొంత మొత్తం క్లెయిమ్‌ చేస్తే, మిగిలిన వారికి ఆ మేరకు క్లెయిమ్‌ మొత్తం తగ్గకపోవటం ఈ పాలసీ ప్రత్యేకత. ఈ బీమా పాలసీని నాలుగు రూపాల్లో అందిస్తున్నారు.
  • కుటుంబం లేదా వ్యక్తిగత కవరేజీ, ప్రీమియం మొత్తాన్ని పాలసీ కావ్యవధి తర్వాత వెనక్కి ఇచ్చేయటం, 36 రకాల వ్యాధుల కవరేజీ ప్లాన్‌, ఒకేసారి హామీ మొత్తాన్ని చెల్లించటం... పాలసీదార్లు వీటిలో తమకు అనుకూలమైన ప్రత్యేకతలు కల పాలసీని ఎంచుకోవచ్చు. 

views: 828

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams