Current Affairs Telugu Daily

హాంకాంగ్‌ మ్యాచ్‌లకు వన్డే హోదా
ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లతో హాంకాంగ్‌ ఆడే మ్యాచ్‌లకు ఐసీసీ వన్డే హోదా కల్పించింది.
  • అర్హత టోర్నీ ద్వారా ఆసియా కప్‌కు ఎంపికైన హాంకాంగ్‌కు వన్డే హోదా లేదు. ఆ జట్టుతో వన్డే హోదా ఉన్న జట్లు ఆడినా ఐసీసీ వాటిని అధికారిక వన్డేలుగా గుర్తించదు.
  • ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్న గ్రూప్‌లో హాంకాంగ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌కు అధికారిక హోదా కట్టబెట్టాలని ఆసియా క్రికెట్‌ మండలితో పాటు బీసీసీఐ కోరగా అందుకు ఐసీసీ అనుమతించింది.
  • శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మరో గ్రూప్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 15న ఆసియా కప్‌ ఆరంభంకానుంది.

views: 759



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams