Current Affairs Telugu Daily

మనుషుల్ని కాపాడే ‘సైబార్గ్‌’ బొద్దింక
భూకంపాల సమయాల్లో భవన శిథిలాల్లో చిక్కుకున్నవారిని గాలించేందుకు తోడ్పడే అవకాశమున్న ‘సైబార్గ్‌’ బొద్దింకను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
  • అమెరికాలోని కనెక్టికట్‌ వర్సిటీ పరిశోధకులు  ఇందుకోసం ప్రత్యేకంగా ఓ న్యూరో కంట్రోలర్‌ మైక్రోసర్క్యూట్‌ను తయారుచేశారు. దీన్ని బొద్దింక నరాల వ్యవస్థకు అనుసంధానం చేసి.. దాని కదలికలను నియంత్రించవచ్చు.
  • ఇలా జీవి, యంత్రం కలగలిసిన వ్యవస్థను సైబార్గ్‌గా పిలుస్తుంటారు. చాలా చిన్నదిగా ఉండే ఈ న్యూరో కంట్రోలర్‌ను బొద్దింక పైభాగంలో అమరుస్తారు.
  • ఆ కీటకానికి ఉండే రెండు మీసాలకు దీన్ని అనుసంధానం చేస్తారు. మైక్రో కంట్రోలర్‌ ద్వారా ఆ మీసాకు శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్‌ సంకేతాన్ని పంపిస్తారు.
  • అప్పుడు కీటకం తాను వెళ్లే మార్గంలో ఏదో అడ్డంకి ఉందన్న భ్రమకు గురవుతుంది. దిశను మార్చుకొని మరోవైపు వెళ్తుంది. ఇలా కుడి మీసానికి సంకేతం అందినప్పుడు ఎడమ వైపు.. ఎడమ మీసానికి సంకేతం అందినప్పుడు కుడి వైపు ప్రయాణిస్తుంది. ఇటు కీటకం చుట్టుపక్కల ఉష్ణోగ్రతల్లో తేడాను గుర్తించే వ్యవస్థ కూడా.. మైక్రో కంట్రోలర్‌ వ్యవస్థలో ఉంటుంది.
  • బ్లూటూత్‌ పరిజ్ఞానం ద్వారా దీని సమాచారం ఎప్పటికప్పుడు పరిశోధకులకు చేరుతుంది. ఈ సైబార్గ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన అభిషేక్‌ దత్తా కూడా ఉన్నారు.

views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams