Current Affairs Telugu Daily

ఈజిప్టులో 75 మందికి మరణశిక్ష
దేశాధ్యక్షుడి తొలగింపునకు సంబంధించి 2013లో ఈజిప్టులో బైఠాయింపు దీక్ష చేపట్టినందుకు గాను 75 మందికి మరణశిక్ష, 47 మందికి యావజ్జీవ  జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం 2018 సెప్టెంబర్‌ 8న తీర్పు వెలువరించింది. ‘
  • ముస్లిం బ్రదర్‌హుడ్‌’ సంస్థ అగ్రనేత మహమ్మద్‌ మోర్సి 2012లో ఈజిప్టులో తొలిసారిగా స్వేచ్ఛగా ఎన్నికైన అధ్యక్షునిగా గుర్తింపు పొందారు.
  • ఏడాది తర్వాత ఆయనను సైన్యం తొలగించింది. దానికి అప్పటి సైన్యాధిపతి అబ్దెల్‌ ఫతహ్ అల్‌ సిసీ నేతృత్వం వహించారు.
  • నిరసనల్ని భగ్నం చేసే క్రమంలో భద్రత బలగాల చేతిలో 600 మంది చనిపోగా, 739 మందిపై హత్యా నేరం, ఆస్తుల విధ్వంసం వంటి అభియోగాలతో కేసు నమోదయ్యాయి. యావజ్జీవ శిక్ష పడినవారిలో బ్రదర్‌హుడ్‌ అధిపతి మహ్మద్‌ బడే కూడా ఉన్నారు.

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams