Current Affairs Telugu Daily

ఆసియా క్రీడలు 2018

 ఏషియన్‌ గేమ్స్‌ 2018లో బాక్సింగ్‌లో భారత్‌ పంచ్‌ అదిరింది. పురుషుల లైట్‌ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత దుస్మాతోవ్‌ హసన్‌బాయ్‌(ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. 

         ఆసియా క్రీడల స్క్వాష్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు స్వర‍్ణ పతక పోరులో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్‌ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దీపికా పళ్లికల్‌, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా బృందం ఆఖరి పోరులో పరాజయం చెందారు. దాంతో స్వ్కాష్‌లో తొలిసారి స్వర‍్ణం అందుకునే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది.


views: 903

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams