Current Affairs Telugu Daily

టాలీవుడ్ మ‌హిళా డైరెక్ట‌ర్ బి.జ‌య క‌న్నుమూత‌
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా డైరెక్ట‌ర్ అయిన బి. జ‌య ఆగ‌స్టు 30 న హైద‌రాబాద్‌లో గుండెపోటు కార‌ణంగా మ‌ర‌ణించారు. 1964 జ‌న‌వ‌రి 11న జ‌న్మించిన జ‌య చెన్నైలో ఎంఎ ఇంగ్లిష్‌, సైకాల‌జీ చ‌దివారు. జ‌ర్న‌లిజం లో పీజీ డిప్లొమాతో 1986లో జ‌ర్న‌లిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. 2003లో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి చంటిగాడు సినిమాను నిర్మించారు. ఆ త‌ర్వాత ప్రేమికులు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, లవ్లీ, వైశాఖం వంటి సినిమాల‌ను తీశారు. ఆమె రాసిన ఆనందో బ్ర‌హ్మ అనే షార్ట్ స్టోరీకి జాతీయ అవార్డును అందుకున్నారు
views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams