Current Affairs Telugu Daily

తస్లీమా నస్రీన్‌ వీసా పొడిగింపు
బంగ్లాదేశ్‌ వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వీసా గడువును భారత్‌ మరో ఏడాది పొడిగించింది. 2017 జులై 23 నుంచి ఈ పొడిగింపు అమలవుతుంది. ఇస్లాం మత ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న తస్లీమా 1994లో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి శరణార్థిగా జీవితం గడుపుతున్నారు. స్వీడన్‌ పౌరసత్వం పొందిన తస్లీమాకు 2004 నుంచి భారత్‌ వీసా పొడిగిస్తూ వస్తోంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందింస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లింలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా రాసిన లజ్జా అనే నవల కూడా చాలా వివాదాస్పదమైంది.
views: 858

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams