Current Affairs Telugu Daily

‘పల్సర్‌’ను కనుగొన్న జోసలీన్‌కు రూ.2,100 కోట్ల బహుమతి 
1968లో అధిక అయస్కాంతశక్తితో కూడిన అణుతారు (పల్సర్‌) ఆకాశంలో పరిభ్రమిస్తున్నట్లు తొలిసారిగా కనుగొన్న బ్రిటిష్‌ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జోసలీన్‌ బెన్‌ బర్నెల్‌కు ‘స్పెషల్‌ బ్రేక్‌త్రూ ప్రైజ్‌’ దక్కింది.
  • పరిశోధన చేపట్టిన 50 సం॥ల తర్వాత ‘ఫండమెంటల్‌ ఫిజిక్స్‌’లో ఆమె దీన్ని గెలుచుకున్నారు.
  • గతంలో ఈ బహుమతిని గెలుచుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌, చైనీస్‌ ఎకోసిస్టం రీసెర్చ్‌ నెట్‌వర్క్‌ (సెర్న్‌) పరిశోధకుల సరసన ఆమె నిలిచారు.
  • ఈ బహుమతి కింద ‘బ్రేక్‌త్రూ ప్రైజ్‌’ సంస్థ జోసలీన్‌కు 30 లక్షల అమెరికా డాలర్లు (2,100 కోట్ల రూపాయలు) ఇవ్వనుంది.
  • పల్సర్‌ తారను కనుగొనడం- ఖగోళ  చరిత్రలోనే అగ్రశ్రేణి పరిశోధనల్లో ఒకటి.
  • ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్నీ, విశ్వంలో కీలకాంశాలను అవగతం చేసుకోడానికి మార్గదర్శిగా నిలిచిన గీటురాయి పరిశోధనిది.

views: 846



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams