Current Affairs Telugu Daily

స్వలింగ సంపర్కం నేరం కాదు: సుప్రీం

పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. ఐపీసీ సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది.

‘అసహజ నేరాల’కు సంబంధించిన సెక్షన్‌ 377 ప్రకారం.. స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగార చర్యలకు పాల్పడినవారికి పదేళ్ల వరకూ జైలుశిక్ష జీవితఖైదు విధించొచ్చు. ఈ సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పరస్పర అంగీకారంతో ఒకే లింగానికి చెందిన ఇద్దరు వయోజనుల మధ్య జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని దిల్లీ హైకోర్టు 2009లో తీర్పును ఇచ్చింది. అయితే 2013లో ఈ తీర్పును సుప్రీం కోర్టు రద్దుచేసి.. తిరిగి పాత నిబంధనలనే వర్తింపజేసింది. తాజాగా దీనిపై స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు సహా మరికొందరు సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌చేస్తూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.


views: 722

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams