Current Affairs Telugu Daily

లైంగిక, ఆమ్లదాడుల  బాధిత మహిళలకు కనీస పరిహారం రూ.4 లక్షలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవ సంస్థ (నల్సా) రూపొందించిన పరిహార పథకం 2018 అక్టోబరు 2 నుంచి అమల్లోకి రానుంది. బాధిత మహిళలకు కనీసం రూ.4 లక్షలు చెల్లించాలని, వారు 18 ఏళ్లలోపు వారైతే మరింత పరిహారం ఇవ్వాలని నల్సా సూచించింది. కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు ప్రత్యేక న్యాయస్థానాలు వీటిని పరిగణనలో తీసుకోవాల్సిందేనని జస్టిస్‌ మదన్‌ బి. లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 సెప్టెంబర్‌ 5న  ఆదేశించింది. బాధితులకు తక్షణమే పరిహారం అందాలంటూ నిర్భయ ఘటనానంతరం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నల్సా సూచించిన దానికంటే ఎక్కువ పరిహారం ఇవ్వొచ్చు కానీ తక్కువ ఇవ్వకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. 
views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams