Current Affairs Telugu Daily

మరో విడత ICJ న్యాయమూర్తిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారి 
ఐక్యరాజ్యసమితి న్యాయ విభాగం-అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీ(69) మరో విడత కొనసాగబోతున్నారు. ఆయనను తమ అభ్యర్థిగా భారతదేశం సిఫార్సు చేసింది. జస్టిస్‌ భండారీ ప్రస్తుత పదవీకాం 2018 ఫిబ్రవరిలో ముగిసిపోనుంది. భారతదేశం తరపున ఆయన పేరును ప్రతిపాదిస్తూ 2017 జూన్‌ 19న పత్రాలను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గటెరస్‌కు అందజేశారు. 2017 నవంబరులో ICJ ఎన్నికు జరుగుతాయి. జస్టిస్‌ దల్వీర్‌ భండారి ఎన్నికైతే 9 సం॥లు కొనసాగుతారు.
ICJ-International Court of Justice
ICJ అధ్యక్షుడు - రోని అబ్రహం (2015 ఫిబ్రవరి 6-2018 ఫిబ్రవరి 5)
ICJ ఉపాధ్యక్షుడు - అబ్దుల్‌కావీ యూసఫ్‌ (2015 ఫిబ్రవరి 6-2018 ఫిబ్రవరి 5)

views: 936

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams