Current Affairs Telugu Daily

మాతృత్వ వందన యోజన అమలులో దక్షిణాదిన కర్నూలుకు అగ్రస్థానం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన(PMMVY) అమలులో కర్నూలు జిల్లా దక్షిణాదిన ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది.
  • ఈ పథకాన్ని 2017 సెప్టెంబర్‌ 1న ప్రధాన మంత్రి నరేంద్రమోడి ప్రారంభించారు.
  • దీని కింద  గర్భిణిగా నమోదైన వెంటనే రూ.1000, ఆరో నెలో మరో రూ.2వేలు, ఆసుపత్రిలో ప్రసవించాక రూ.1000, శిశువుకు మూడు విడతల రోగ నిరోధక టీకాలు అందించిన తర్వాత రూ.2వేలు కలిపి మొత్తం రూ.6 వేలు ప్రోత్సాహక నగదు అందిస్తారు.  
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ‘తల్లీబిడ్డ చల్లగా..’ అని పేరు మార్చి అమలు చేస్తోంది. 
PMMVY-Pradhan Mantri Matritva Vandana Yojana

views: 1090



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams