Current Affairs Telugu Daily

సింగపూర్‌లో భాగవత జయంత్యుత్సవం 
‘తెలుగు భాగవత ప్రచార సమితి’, గణనాయము సంయుక్త ఆధ్వర్యంలో 2018 సెప్టెంబర్‌ 2న సింగపూర్‌లో భాగవత జయంత్యుత్సవం-2018 నిర్వహించారు. శ్రీమద్భాగవత గ్రంథంలోని భక్తితత్వం అందరికీ అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయం కావాలన్న సంకల్పంతో, పోతన తెలుగు భాగవతం మరింత ప్రాచుర్యం పొందే దిశగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని వందలాది మంది తెలుగు వారు హాజరయ్యారు. చిన్నారుల్లో భాగవతతత్వం అలవరచడానికి భాగవత ఇతివృత్తానికి చెందిన చిత్రలేఖనం, కథల పోటీలు నిర్వహించారు. విజేతలకు శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామి ధ్రువపత్రాలు అందజేశారు. 
views: 772

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams