Current Affairs Telugu Daily

దూకుడుగా వాహనం నడిపి బీమా పరిహారం కోరలేరు: సుప్రీంకోర్టు
నిర్లక్ష్యపూరితంగా, దూకుడుగా వాహనాన్ని నడిపిస్తూ రహదారి ప్రమాదానికి పాల్పడినవారు బీమా పరిహారాన్ని కోరలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • వ్యక్తిగత ప్రమాద బీమా కవచం కింద లభించే పరిహారాన్ని పొందడానికి మాత్రం బాధితుడు అర్హుడేనని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ధర్మాసనం తేల్చిచెప్పింది.
  • 2012 మే 20న జరిగిన రహదారి ప్రమాదంలో చనిపోయిన దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి కుటుంబీకులకు రూ.10.57 లక్షల పరిహారం చెల్లించాలంటూ నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీకి త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
  • భౌమిక్‌ సొంత నిర్లక్ష్యం వాల్లనే ప్రమాదం జరిగిందని, మోటారు వాహన చట్టంలోని తృతీయ పక్షం అనే నిర్వచనం కిందికి ఆయన రారని బీమా సంస్థ సుప్రీంకోర్టులో వాదించింది.
  • ఈ అప్పీలుతో ధర్మాసనం ఏకీభవించింది. వ్యక్తిగత ప్రమాద బీమా కింద మాత్రం వడ్డీతో కలిపి రూ.2 లక్షలు బాధితుని కుటుంబానికి చెల్లించాలని తెలిపింది.

views: 816



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams