Current Affairs Telugu Daily

పురాతన ఈజిప్ట్‌ మమ్మీ ముఖం పున:సృష్టి 
సుమారు 3500 సం॥ల నాటి ఓ ఈజిప్ట్‌ మమ్మీ ముఖాన్ని ఇటలీలోని టురిన్‌ విశ్వవిద్యాయ శాస్త్రవేత్తలు పున:సృష్టించారు. ఈ మమ్మీ ఫారో తట్మోసెస్‌-3 రాజ్యంలో ఉన్నత వర్గానికి చెందిన నెబ్రీ అనే వ్యక్తికి చెందినదిగా శాస్త్రవేత్తలు తెలిపారు. చనిపోయిన సమయంలో నెబ్రీ వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. నెబ్రీ మరణానికి గుండెపోటే కారణమని రెండేళ్ల క్రితం శాస్త్రవేత్తలు తేల్చడంతో అప్పట్లో ఈ మమ్మీ గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. గుండె వైఫల్యానికి సంబంధించి నమోదైన కేసుల్లో అతిపురాతమైనది ఇదే కావడం అందుకు కారణం. ప్రస్తుతం నెబ్రీ ఇటలీలో టురిన్‌లోని ఈజిప్ట్‌ ప్రదర్శనశాలలో ఉంది.

views: 1080

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams