Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ 
పాకిస్థాన్‌ నూతన(13వ) అధ్యక్షుడిగా దంత వైద్యుడైన ఆరిఫ్‌ అల్వీ 2018 సెప్టెంబర్‌ 4న ఎన్నికయ్యారు. అధికార ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ)’ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు.
  • దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో.. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి ఐత్‌జాజ్‌ అహసన్‌, ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌’ అభ్యర్థి మౌలానా ఫజల్‌ ఉర్‌ రహమాన్‌ను అల్వీ ఓడించారు.
  • జాతీయ అసెంబ్లీ, సెనేట్‌లో మొత్తం 430 ఓట్లు పోలవగా.. అల్వీ 212 ఓట్లు దక్కించుకున్నారు. పాక్‌ ప్రస్తుత అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ పదవీకాలం 2018 సెప్టెంబర్‌ 8తో ముగుస్తుంది. అనంతరం దేశ 13వ అధ్యక్షుడిగా అల్వీ బాధ్యతలు చేపడతారు.
పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి - ఇమ్రాన్‌ఖాన్‌

views: 790

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams