Current Affairs Telugu Daily

దివ్యాంగ చిత్రకారిణికి నెలకు రూ. 10,000 పింఛను 
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చొరవతో దివ్యాంగ చిత్రకారిణి షేక్‌ నఫీస్‌కి ప్రతినెలా రూ.10 వేల పింఛను మంజూరు చేస్తూ రాష్ట్రసాంస్కృతిక శాఖ ఉత్తర్వు జారీ చేసింది.
  • 2018 ఆగస్టు మొదటి వారంలో కేటీఆర్‌ రవీంద్రభారతిలో చిత్రప్రదర్శనకు వెళ్లారు. మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగ చిత్రకారిణి షేక్‌ నఫీస్‌ అక్కడ అద్భుతమైన చిత్రాలను రూపొందించినట్లు తెలుసుకొని అబ్బురపడ్డారు.
  • ఈ సందర్భంగా ఆమె తాను మస్క్యులర్‌ డిస్ట్రొఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
  • దీనికి ఆయన స్పందిస్తూ నఫీస్‌కు జీవితాంతం పింఛను ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతికశాఖ అధికారులను ఆదేశించారు. నిమ్స్‌లో ఆమెకు అవసరమైన వైద్యసాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
  • దీనికి అనుగుణంగా సాంస్కృతికశాఖ ఉమ్మడి ఖాతాను తెరిచి రూ.10 లక్షలు అందులో జమ చేసింది. దీనినుంచి రూ.10 వేల చొప్పున ప్రతి నెలా పింఛను విడుదల చేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. 

views: 737

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams