Current Affairs Telugu Daily

వెలుగులోకి రెండు కొత్త జాతి డైనోసార్లు
కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘క్సియుంకుస్‌’, ‘బన్నీకుస్‌’గా పిలిచే రెండు కొత్త జాతి డైనోసార్లను కనుగొన్నారు. డైనోసార్లలో కొన్ని.. పరిణామక్రమంలో పక్షులుగా అవతరించాయని, మరికొన్ని పొట్టి చేతులను కలిగి ఉన్న కీటకభక్ష జీవులుగా ఆవిర్భవించాయని పేర్కొన్నారు. భూమిపై 16 కోట్ల ఏళ్ల క్రితం నుంచి తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం వరకు ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించారు. ‘క్సియుంకుస్‌’, ‘బన్నీకుస్‌’పై విస్త ృత పరిశోధనలతో.. డైనోసార్ల వంశక్రమాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చునని వెల్లడించారు.
views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams