Current Affairs Telugu Daily

డిల్లీలో దేశంలో మొట్టమొదటి ఎల్‌ఈడీ సినిమా తెర
దేశంలో మొట్టమొదటి ఎల్‌ఈడీ సినిమా తెరను డిల్లీలో పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. శామ్‌సంగ్‌ సంస్థ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. 
  • ఎల్‌ఈడీ తెరకు ప్రొజెక్టర్‌ అవసరం ఉండదు. మామూలుగా సినిమా నడిచేటప్పుడు హాల్లో లైట్లన్నీ ఆర్పేస్తారు. అయితే, ఎల్‌ఈడీ తెర ఉంటే లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌లో లైట్లు ఉన్నా సినిమా చూడటానికి ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు.
  • ఈ తెర ఏర్పాటుకు రూ.7 కోట్లు ఖర్చయింది. 2017లో తొలిసారిగా కొరియాలో ఎల్‌ఈడీ తెర(ఆనిక్స్‌ స్క్రీన్‌)ను పరిచయం చేశారు. 

views: 963

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams